వేగంగా నడిపితే ఉపేక్షించేది లేదు: ఎస్సై
E.G: వేగేశ్వరపురం జూనియర్ కాలేజ్ వద్ద తాళ్లపూడి ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న యువకులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అవగాహన కల్పించారు. వాహనాలను వేగంగా నడిపితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.