యుద్ధం.. రాజ్‌నాథ్ అధ్యక్షతన మంత్రివర్గ బృందం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తలెత్తే సమస్యలను పరిశీలించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం ఓ మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతర కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం.