175 నియోజకవర్గాల్లో పార్కులు: మంత్రి భరత్

175 నియోజకవర్గాల్లో పార్కులు: మంత్రి భరత్

AP: 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. త్వరలో ఓర్వకల్లులో ఫ్లైట్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దుపాడు నుంచి ఓర్వకల్లు మీదుగా బేతంచర్లకు రైలుమార్గం, ఓర్వకల్లు జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీకి త్వరలో వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లుకు త్వరలో మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని పేర్కొన్నారు.