నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన అధికారులు

నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన అధికారులు

KMR: నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ నుంచి ప్రధాన కాలువ ద్వారా యాసంగికి నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ప్రాజెక్ట్​ అధికారులు నేడు ఉదయం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి సోమవారం ఉదయం 550 క్యూసెక్కులు నీటిని ప్రధాన కాలువకు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు.