ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్య శారద మంగళవారం పరిశీలించారు. రైతులు, మహిళా కార్మికులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ, తూకాలు, ధాన్యం ఎండబెట్టడం వంటి అంశాలను తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు అధికారులవర్గాలు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.