VIDEO: కంచి సముద్రంలో ఘనంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట
సత్యసాయి: లేపాక్షి మండలం కంచి సముద్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆలయంలో స్వామి వారికి కుంభాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.