అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

VKB: బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శ్రీశైలం యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాసింపూర్ గ్రామానికి చెందిన నరేష్ గౌడ్, రమేష్ అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడినట్లు పేర్కొన్నారు.