లిక్విడ్ గంజాయి కేసులో నిందితుడు అరెస్ట్

లిక్విడ్ గంజాయి కేసులో నిందితుడు అరెస్ట్

AKP: లిక్విడ్ గంజాయి కేసులో రెండు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని నక్కపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరి 23న హైదరాబాద్‌కు చెందిన శ్యామ్ రాకేష్ కుమార్‌పై లిక్విడ్ గంజాయి కేసు నమోదు చేశామని సీఐ మురళి తెలిపారు. అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడిని నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌గేట్ వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.