'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLR: నాగిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఉదయగిరి MLA కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఆయన ప్రతి రైతు కుటుంబంతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా, అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతగా రూ. 7 వేల ఆర్థిక సహాయం రైతుల ఖాతాలలో జమ అయిందా లేదా అని ప్రతి ఇంటికి వెళ్లి రైతులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.