రుషికొండ భవనాల వినియోగంపై ముగిసిన భేటీ
AP: రుషికొండ భవనాల వినియోగంపై GoM భేటీ ముగిసింది. ఈ సందర్బంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. రుషికొండ భవనాల వినియోగంపై ప్రజాభిప్రాయం తీసుకున్నామని అన్నారు. టాటా గ్రూప్, లీలా ప్యాలెస్‌తో పాటు.. అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. వచ్చే వారం మరోసారి సమావేశమవుతామని పేర్కొన్నారు.