'మైనారిటీ విద్యార్థులకు సువర్ణావకాశం'
E.G: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సౌకర్యం కల్పిస్తుందని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం అయన మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకోవడానికి మైనారిటీ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశమన్నారు. అఫ్ లైన్, ఆన్ లైన్ కోర్సులు ఉన్నాయని.. ప్రవేశ పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులచే శిక్షణ ఇస్తారని వివరించారు.