నేడు మధిరకు డీఆర్ఎం పర్యటన
KMM: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్.గోపాలకృష్ణన్ సోమవారం మధిర రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేయనున్నారు. పందిళ్లపల్లిలో ఇటీవల నిర్మించిన గూడ్స్ షెడ్‌ను, మధిరలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వేస్టేషన్ పనులను పరిశీలిస్తారు. ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ పరిశీలించిన అనంతరం సంబూరు వరకు నూతనంగా నిర్మించనున్న రైల్వే లైన్ పనులపై సమీక్షించనున్నారు.