జనగామలో రైతు భీమా పథకం.. 1.27 లక్షల మంది నమోదు

జనగామలో రైతు భీమా పథకం.. 1.27 లక్షల మంది నమోదు

JN: జిల్లాలో రైతు భీమా పథకం కింద 1,27,418 మంది రైతులు నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 91.08% రెన్యూవల్స్ పూర్తయ్యాయని, అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు 10 రోజుల్లో రూ. 5 లక్షల బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు ఆర్థిక భద్రత పొందాయని తెలిపారు.