తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా?

తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా?

ప్రస్తుత జీవనశైలి వల్ల కొందరు తరచూ స్నానానికి ముందే తింటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే పేగుల ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పులు కలిగి జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుందని, దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. కడుపు తిమ్మిరి కూడా కలుగుతుందని, స్నానం తర్వాతే తినాలని సూచిస్తున్నారు.