చలివేంద్రాన్ని ప్రారంభించిన ఏపీఎం శ్రీధర్

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఏపీఎం శ్రీధర్

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని DRDA వెలుగు కార్యాలయం వద్ద ఏపీఎం శ్రీధర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల దాహార్థిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇంట్లో పిల్లల పట్ల శ్రద్ద వహించాలని పేర్కొన్నారు. ఎండల దృష్ట్యా మద్యాహ్నం వేళలో బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.