పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

W.G: భీమవరం గునుపూడి 11వ వార్డులోని వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు పింఛన్లను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ.. నెల నెల ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారా, సకాలంలో అందుతుందా, ఎంత ఇస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీశారు. పెన్షన్ల మొత్తంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని సూచించారు.