కోటి సంతకాల ప్రతులకు రేపు రామతీర్థంలో పూజలు
VZM: వైద్యకళాశాలల ప్రయివేటీకరణను నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ఈనెల 10న రామతీర్థం రామస్వామి పాదాల చెంతన పెట్టి పూజలు నిర్వహిస్తామని నెల్లిమర్ల వైసీపీ సమన్వయకర్త బడ్డుకోండ అప్పలనాయుడు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సంతకాల ప్రతులను పూజ అనంతరం ర్యాలీగా విజయనగరం వెళ్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకి ఆందబేస్తామని పేర్కొన్నారు.