'పలు వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా'
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 10వ, 18 వ వార్డులలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ బృంగి రత్నమాల తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక కౌన్సిలర్స్‌తో ఆమె వార్డులలో పర్యటించారు. అనంతరం ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు.