అసంపూర్తిగా.. సమీకృత మార్కెట్ నిర్మాణం

అసంపూర్తిగా.. సమీకృత మార్కెట్ నిర్మాణం

NLG: చిట్యాలలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. 2022 మార్చిలో శంకుస్థాపన చేసిన ఈ భవనం గ్రౌండ్, మొదటి అంతస్తు స్లాబ్ పనులు పూర్తయ్యాక నిలిచిపోయింది. దీంతో కూరగాయల వ్యాపారులు మార్కెట్ యార్డులో, మాంసం విక్రేతలు రోడ్డుపైనే వ్యాపారాలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.