రైస్ బాల్స్ వండిన‌ గడ్కరీ.. రుచి చూసిన ప్రియాంక

రైస్ బాల్స్ వండిన‌ గడ్కరీ.. రుచి చూసిన ప్రియాంక

కేరళ వయనాడ్ నియోజకవర్గ సమస్యలను తెలిపేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆఫీసులో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రియాంకతో పాటు ఆమెతో వచ్చిన కాంగ్రెస్ నాయకులకు బియ్యం పిండితో చేసిన రైస్ బాల్స్ వంటకం, చట్నీని వడించారు. అయితే ఈ వంటకాన్ని గడ్కరీ స్వయంగా తయారు చేసినట్లు తెలుస్తోంది.