తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ

అనంతపురం MP అంబిక లక్ష్మీనారాయణ సోమవారం తిరుమల పుణ్యక్షేత్రంలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దివ్యదర్శనం అనంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నిరంతరం కొనసాగాలని, ప్రజలందరూ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.