భారీగా పడిపోయిన ఉల్లి ధరలు

KRNL: కర్నూలు మార్కెట్ యార్డులో గతేడాది క్వింటాలుకు అత్యధికంగా రూ. 5 వేల వరకు ధర పలకగా ప్రస్తుతం రూ. 600కు ధర పడిపోయింది. కోడమూరుకు చెందిన ఓ రైతు క్వింటాలు ఉల్లిని కేవలం రూ. 400 చొప్పున విక్రయించారు. కాగా, జిల్లాలో 10,469 హెక్టార్లలో రైతులు ఉల్లి సాగు చేశారు. పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వ్యాపారులు తగిన ధర చెల్లించకుండా భారీగా కోతలు పెడుతున్నారు.