VIDEO: గట్టు పంచాయితీ.. తలలు పగిలాయి!

VIDEO: గట్టు పంచాయితీ.. తలలు పగిలాయి!

SRPT: ఆత్మకూరు (ఎస్): మండలంలోని పాతర్లపాడులో పొలం గట్టు వివాదం ఇవాళ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. పెద్దమనుషుల తీర్మానాన్ని కాదని మైసయ్య, రమేష్ వర్గాలు కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో మహిళ సహా ఆరుగురికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రణరంగాన్ని తలపించిన ఈ దాడి దృశ్యాలు గ్రామంలో వైరల్‌గా మారాయి.