'పోస్టల్ డిపార్ట్‌మెంట్ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి'
CTR: పుంగనూరులోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో తపాలా శాఖ సబ్ డివిజన్ స్థాయి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా SPO లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తపాలా శాఖ అంటేనే ప్రజలకు ఓ నమ్మకం అన్నారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా అందించే సేవలను ప్రజలకు మరింత చేరువుచేయాలనీ కోరారు.