కేంద్ర రక్షణ నిధికి ఎమ్మెల్యే విరాళం

కేంద్ర రక్షణ నిధికి ఎమ్మెల్యే విరాళం

సత్యసాయి: కేంద్ర రక్షణ నిధికి మడకశిర ఎమ్మెల్యే MS రాజు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అనంతరం భారత సైనికులకు మద్దతుగా మడకశిరలోని R&B గెస్ట్ హౌస్ నుంచి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సర్కిల్ వరకు జాతీయ జెండాను చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించి, సెల్యూట్ చేశారు.