టీడీపీ కార్యకర్తను పరామర్శించిన ఎంపీ
KRNL: అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బాబును ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ పరామర్శించారు. ఆసుపత్రిలోని ఏ.ఎం.సీ వార్డులో చికిత్స పొందుతున్న బాబును కలసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.