ఆకట్టుకున్న బ్రహ్మం వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం

ఆకట్టుకున్న బ్రహ్మం వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం

SRCL: చందుర్తి మండల కేంద్రంలో వీరబ్రహ్మేంద్రస్వామి వీధి నాటకం ప్రజలను ఆకట్టుకుంది. సోమవారం వీరబ్రహ్మేంద్ర స్వామి వీధి నాటకాన్ని స్థానిక సాధు సజ్జన భజన మండలి కళాకారులు ప్రదర్శించారు. గత ఐదు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రను తెలుపుతూ నాటక ప్రదర్శన కొనసాగిస్తున్నారు.