మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత

NRML: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కడెం తహసీల్దార్ సుజాత రెడ్డి సూచించారు. గురువారం కడెం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నాగోరావు, ఆర్ఎలు తక్కన్న, లక్ష్మణ్ ఉన్నారు.