మూడోవంతు బేళ్ల తిరస్కరణ

మూడోవంతు బేళ్ల తిరస్కరణ

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం జరిగిన వేలంలో మూడోవంతు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి మొత్తం 1268 బేళ్లు అమ్మకానికి రాగా, 839 మాత్రమే కొనుగోలు చేశారు. జువ్విగుంట, తంగెళ్ల ప్రాంతాల నాణ్యమైన ఎర్రనేల పొగాకును ప్రైవేట్ కొనుగోలుదారులు తిరస్కరించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.