'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

నంద్యాల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ. 2,400ల ప్రకారం ప్రభుత్వమే రైతుల వద్ద ఉన్న మొత్తం మొక్కజొన్నలను కొనుగోలు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు.