పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

MNCL: చెన్నూరు మండలంలో పేకాట స్థావరాలపై గురువారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సీఐ బన్సీలాల్ వివరాల ప్రకారం.. దుగ్నేపల్లి శివారులో ఎస్సై శ్యామ్ పటేల్ బృందం దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో 13 మంది పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ. 36 వేల నగదు, 5 మొబైల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.