ఆదమరిస్తే అంతే సంగతులు
PLD: వినుకొండ ముళ్లమూరు బస్టాండ్ ప్రధాన రహదారిలో మున్సిపల్ డ్రైనేజ్ స్లాబ్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ రంధ్రం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవిస్తే తప్ప అధికారులు చర్యలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.