నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
MBNR: దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో నేడు మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈవో శ్యాంసుందర్ తెలిపారు. దాదాపు 5 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు.