వేసవి దాహార్తి తీరుస్తున్న నీటితొట్లు: జేఈ

ATP: ఉపాధి హామీ పథకం కింద మూగజీవాల వేసవి దాహార్తిని తీర్చడానికి నిర్మిస్తున్న నీటితొట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని యాడికి NRGS JE ఈశ్వర్ రెడ్డి తెలిపారు. యాడికి మండలం పెద్దపేటలో నిర్మించిన పశువుల తొట్టిని జేఈ పరిశీలించారు. మూగజీవాల కొరకు నిర్మించిన నీటి తొట్టి దాహార్తిని తీరుస్తుందన్నారు. మండలంలో మరిన్ని నీటితొట్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు.