అవినీతి ఆరోపణలు.. ఐదుగురు ఎస్సైలను రేంజ్‌కు అప్పగింత
VSP: నగరంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎస్సైలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చర్యలు తీసుకున్నారు. తక్షణమే ఈ అధికారులను రేంజ్‌కు అప్పగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. త్రీటౌన్ క్రైమ్ ఎస్సై సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైమ్ ఎస్సై సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్సై ప్రసాద్, ఫోర్త్ టౌన్ క్రైమ్ ఎస్సై విజయ్‌కుమార్, భీమిలి ఎస్సై భరత్ కుమార్ రాజులు రేంజ్‌కు అప్పగించారు.