VIDEO: 'అమలాపురంలో ప్రపంచ తెలుగు మహా సభలు'
కోనసీమ: ఈనెల 28, మార్చి 1వ తేదీలలో అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహా సభలు జరుగుతాయని కిమ్స్ ఛైర్మన్ కలిదిండి సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) తెలిపారు. అమలాపురంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మహా సభలకు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్‌లు, జడ్జి లు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని అన్నారు.