అంతరించి పోతున్న మత్స్య సంపద: సీపీఎం
NDL: కృష్ణా నదిలో చేపల వేట చేస్తున్న కాంట్రాక్టర్లు, మద్య దళారులు అలివి వలలు ఉపయోగించడంతో, చేప పిల్లల సంపద అంతరించి పోతుందని సీపీఎం మండల కన్వీనర్ పక్కిరి సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పగిడ్యాల మండలం, నెహ్రు నగర్ కృష్ణా నదిలో చేప పిల్లలను విడుదల చేయడానికి వచ్చిన ఎమ్మెల్య జయసూర్యకు సీపీఎం నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.