గిరిజన గ్రామాలలో సుస్థిర ఆస్తుల కల్పన

ASR: అనంతగిరి మండలం పరిధిలో గల పినకోట గ్రామంలో ఉపాధి హామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా రెండు శ్రమశక్తి సంఘాలకు 40మంది పైబడి వేతనదారులు రాతి కోటలు పనులు చేస్తున్నారు. ఈ సందర్బంగా వేతన దారులు మాట్లాడుతూ.. పనులకు గిట్టుబాటు అయ్యే వేతనంతోపాటు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు.