ఆగిరిపల్లిలో పీజీఆర్ఎస్ నిర్వహించిన మంత్రి
ELR: ఆగిరిపల్లి మండలం కలటూరు గ్రామంలో మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకలు పాల్గొన్నారు.