బాలిక అదృశ్యంపై కేసు నమోదు
AKP: ఎలమంచిలి పట్టణానికి చెందిన ఓ బాలిక అదృశ్యం అయింది. ఈ మేరకు ఆమె తండ్రి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సావిత్రి బుధవారం తెలిపారు. ఈనెల 25వ తేదీ రాత్రి ఇంటి తాళం పోవడంతో కుటుంబ సభ్యులు బాలికను మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన కుమార్తె అదృశ్యం అయినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసామని ఎస్సై తెలిపారు.