'పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'
SRCL: పెద్దమ్మ తల్లి ఆశీస్సుల ప్రజల అందరిపై ఉండాలని కోరుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. గురువారం కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెదమ్మ జాతర మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య తదితరులు ఉన్నారు.