VIDEO: మసీదుకు నిప్పంటించిన దుండగులు

VIDEO: మసీదుకు నిప్పంటించిన దుండగులు

ప్రకాశం: త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి మసీదులో నిప్పు అంటించారు. త్రిపురాంతకం మండలంలో ముస్లింలు అధికంగా నివసించే గ్రామం దూపాడు మాత్రమేనని ఇక్కడ ఎన్నో ఏళ్లుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి అన్నాదమ్ముల వలె జీవిస్తూ ఉంటారు. ఈ ఘటన జరగడం బాధాకరం అని గ్రామస్తులు తెలిపారు.