VIDEO: తమ డబ్బు ఇవ్వడం లేదని మహిళల ఆవేదన
కృష్ణా: ఉంగుటూరు మండల పోస్ట్ ఆఫీసులో మహిళలు దాచుకున్న తమ పొదుపు డబ్బులను విడుదల చేయడం లేదని బాధితులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు పోస్టాఫీసు అధికారులను సంప్రదించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, డబ్బులు మహిళలకు అందేలా చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.