జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: SP నితికా పంత్
ASF: ఆసిఫాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని SP నితికా పంత్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఒకేసారి పెట్రోల్ బంకులకు వెళ్లడం వల్ల అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని SP పేర్కొన్నారు.