పుట్టపర్తిని అభివృద్ధి చేద్దాం: ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి చిత్రావతి రోడ్డు, చెక్ డ్యాం, హారతి ఘాట్ వద్ద నదీ పరివాహక ప్రాంతాలను ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులతో కలిసి ఇవాళ పరిశీలించారు. గోదావరి పుష్కరాల తరహాలో స్నానపు ఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పుట్టపర్తిలోని క్యాంపు కార్యాలయంలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల వేడుకల ఏర్పాట్లపై చర్చించారు.