కొత్త కొళాయి కనెక్షన్లు ఇవ్వాలని వినతి

KRNL: దేవనకొండ మండల కేంద్రంలోని పాత మార్కెట్ కాలనీ వాసులు తమకు కొత్త కొళాయి కనెక్షన్లతో పాటు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. డిప్యూటీ ఎంపీడీవో గోపాల్, పంచాయతీ కార్యదర్శి రఫీకి వినతి పత్రం అందజేశారు. తమకు కొత్త కొళాయి కనెక్షన్లు మంజూరు చేసి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని కాలనీవాసులు కోరారు. అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.