రేపటి నుంచి టోల్ గేట్ల వద్ద 'నో క్యాష్'
ఏప్రిల్ 1 నుంచి నుంచి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఇకపై కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే రుసుము చెల్లించాలి. రద్దీ తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు NHAI ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని, డిజిటల్ చెల్లింపులకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.