సంగారెడ్డి జిల్లాలో 710 పాఠశాలలు ఎంపిక

SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో యుడైస్ పోర్టులో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్యను పరిశీలించడానికి జిల్లాలో 710 పాఠశాలలను ఎంపీక చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ.. 52 మంది డీఎడ్, బీఎడ్ చదువుతున్న విద్యార్థులు రేపటి నుంచి ఈనెల 21 వరకు ఎంపిక చేసిన పాఠశాలలను పరిశీలించనున్నారని పేర్కొన్నారు.