మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్వ్యూలు

NRPT: నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుకు అర్హులైన వారు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని జిల్లా వైద్య శాఖ అధికారి జయ చంద్రమోహన్ తెలిపారు. MBBS పూర్తి చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అర్హులని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంటర్వ్యూ ఈనెల 20న జిల్లా DMHO కార్యాలయంలో నిర్వహిస్తారన్నారు.