అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కడప: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముద్దనూరు(M) ఉప్పలూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలూరు గ్రామానికి చెందిన రైతు మడక రామకృష్ణ(50) నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని కూరగాయల పంటలు సాగు చేసేవాడు. పంటల సాగు నిమిత్తం దాదాపు రూ.10లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి రాక మనస్తాపంతో రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.